శ్రీ మహావిష్ణువు తత్వం!

శ్రీ మహావిష్ణువు తత్వం!

.

విష్ణుమూర్తి ఎప్పుడూ దేవతలకే సహాయం చేస్తాడు .

రాక్షసులకు చేయడు . ఎందుకు ? 

సమాధానం పోతన పలికించిన పద్యమిది . 

.


"త్రంబులు త్రైలోక్య ప

విత్రంబులు భవలతాలవిత్రంబులు స

న్మిత్రంబులు మునిజనవన

చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్!

భావం: శ్రీమహావిష్ణువు చరిత్రలు కేవలం విచిత్రాలు మాత్రమే కావు. ముల్లోకాలను పవిత్రం చేసేటువంటివి. 

జీవరాసులకు మంచిమిత్రుల వంటివి. అడవులకు వసంత ఋతువు 

ఆనందం కలిగిస్తుంది. అదేవిధంగా ఈ చరిత్రలు మునులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇవి సంసార బంధం అనే లతలను అవలీలగా ఛేదించే 

లవిత్రాలు (కొడవలి వంటివి)... 

.

శ్రీ మహావిష్ణువు తత్వం ఎవరికీ అంతు పట్టదు . 

పృకృతికి చెందకుండా ( సంసార బంధాలకు అతీతంగా ) , 

తన మాయతో గుణాలు సృష్టించాడు . సత్వగుణ ప్రధానంగా దేవతలను , మహర్షులను , తమోగుణ ప్రధానంగా రాక్షసులను సృజించాడు .

సత్వగుణం స్వామికి ఇష్టం కనుక సత్వ గుణ ప్రధానులైన 

దేవతలకు సంతోషం కలిగిస్తూ , తమో గుణ ప్రధానులైన రాక్షసులకు 

ఖేదం కలిగిస్తూ ఉంటాడు . 

ఇంకా అర్థం చేసుకోవాలంటే తమోగుణం మనుష్యులను నిద్రాపరవశులను చేస్తుంది . సత్వ గుణం మనిషిని మేలుకొలిపే తత్వం కలది .

భగవంతుని లీలా విలాసాలు చూడాలంటే మనిషి మేలుకొని ఉండాలి . రాక్షసులను చంపి దేవతలను కాపాడడమనే కథల ద్వారా మనలను నిద్రావస్థనుండి మేలుకొనమని పరమాత్మ మనకు పరోక్షంగా తెలియజేస్తున్నాడు .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!