నీలాసుందరీ పరిణయము - కూచిమంచి తిమ్మకవి

నీలాసుందరీ పరిణయము - కూచిమంచి తిమ్మకవి

(Satyanarayana Piska గారి కృతజ్ఞలతో...)

.

"బలు తెలి పుల్గు వారువము, బంగరువీణియ, మిన్కుటందెలున్,

చిలుక తుటారిబోటియును, జిందపువన్నియ మేనుఁ, బొత్తమున్,

చెలువపు తెల్లతమ్మివిరి సింగపుగద్దెయుఁ గల్గి యొప్పు న

ప్పలుకులచాన, జానలరు పల్కులొసంగెడుఁ గాత నిచ్చలున్."

.

(నీలాసుందరీ పరిణయము - కూచిమంచి తిమ్మకవి)

.

భావము: 

మిక్కిలి తెల్లనైన హంసవాహనముతో, పాదములకు ప్రకాశించు అందెలతో, శంఖమువంటి శ్వేతవర్ణశోభిత దేహకాంతితో, 

తెల్లని తామరపూవు సింహాసనముపై అధివసించియున్నది వాణీమాత! ఆమె తన హస్తములలో స్వర్ణవీణ, చిలుక, పుస్తకములను ధరించియున్నది. "అటువంటి వాగ్దేవి తనకు సరళసుందరములైన అచ్చతెలుగు పలుకులను ప్రసాదించి, ఆశీస్సులను అందించుగాక" 

.

అని కవి ఆకాంక్షిస్తున్నాడు.

.

"నీలాసుందరీ పరిణయము" అచ్చతెలుగు కావ్యము.

అందుకు అనుగుణంగా ఈ భారతీదేవి ప్రార్థనాపద్యం 

కూడా అచ్చమైన తెలుగు పదాలతోనే సాగినది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!