ధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1001) (శ్రీ శేషప్ప కవి)

                       ధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!


ధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1001)

(శ్రీ శేషప్ప కవి)

.

సీ|| బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని,

మరణకాలమునందు మఱతునేమో?

యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి

ప్రాణముల్ పెకలించి పట్టునపుడు

కఫ వాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ

గంప ముద్భవమంది, కష్టపడుచు

నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచుఁ

బిలుతునో! శ్రమచేతఁ బిలువలేనొ?

.

తే|| నాటికిప్పుడె చేసెద నామభజనఁ

దలఁచెదను జేరి వినవయ్య ! దైర్యముగను

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!