దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్రవర్తి !

-

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు !

.

“దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్రవర్తి 

రమ్మన్న చోటికి నమ్మిన వాడు. కొండలలో నెలకొన్న 

కోనేటి రాయడు వీడు” అన్న అన్నమయ్య కీర్తన విన్నవాళ్ళకు తొండమాన్ చక్రవర్తి ఎవరా అని అనుమానం వస్తుంది.

అసలు ఎవరు ఈ తొండమాన్? 

శ్రీనివాసునివిగ్రహానికి శంఖచక్రాలు ఎందుకు లేవు?

.

వైఖానసముని పూజ చేస్తున్న రోజులలో అక్కడ రంగదాసు అని ఒక శూద్రుడు ఉండేవాడు. పూలతోట పెంచి రోజూ పువ్వులు స్వామికి కైంకర్యం చేసేవాడు. ఒకనాడు తోటలో పూలు కోస్తుండగా కుండల అనే గంధర్వుడు తన అప్సరస స్త్రీలతో కలిసి విహారానికి వచ్చాడు. రంగాదాసుకు వారిని చూసి దృష్టి చలించింది. ఆ గంధర్వునిపై కొంత ఈర్ష్య, అంతమంది స్త్రీల సాంగత్యం అతడిని అనన్యమనస్కుడిని చేసింది. అలాగే పూలు కోసి కైన్కర్యానికి పంపుతాడు. 

భగవంతుడు ఆ పూలను స్వీకరించడు. శ్రద్ధాభక్తులు లేకుండా చేసిన కైంకర్యం స్వీకరించనని సందేశం అది. “ఏ దేహంతో తప్పు చేశావో ఆ దేహాన్ని విడిచి వేరే దేహం తీసుకో. స్త్రీ వాన్చతో విడుస్తున్న దేహం వల్ల కొత్తగా వచ్చే దేహంలో రాజువై ఎందరో రాణుల పొందు లభిస్తుంది” 

అని ఆనతి ఇచ్చారు. కానీ రంగదాసు భక్తుడు కనుక భగవంతుడు ఆ శాపాన్నే అనుగ్రహంగా మలచి అతడికి సాధనాశరీరంఇస్తాడు. 

అలా రంగదాసు కొంతకాలం తర్వాత పొందిన రాజు దేహమే “తొండమాన్ చక్రవర్తి” – స్వామి వారికి అత్యంత అభిమాన భక్తుడు, ఆకాశరాజు తమ్ముడు.

.

వకుళా దేవి శ్రీనివాసుని సంబంధం తెచ్చినప్పుడు ఆకాశరాజు తన గురువు బృహస్పతిని సలహా అడిగితే ఆ శ్రీనివాసుడే శ్రీమన్నారాయణుడు అని, రుద్రులు పద్మ సరోవరంలో శుకమునిగా వాసం చేస్తున్నారు కనుక ఆయననే సలహా అడగమని పంపుతాడు. అప్పుడు తన తమ్ముడైన తొందమానునే ఆకాశరాజు శుకుల వద్దకు పంపుతాడు. 

పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణంలో ఆధ్వర్యం వహించి తరించింది ఆయనే. శ్రీనివాసుని ఆజ్ఞతో కొండపై శ్రీనివాసునికి మూడు ప్రాకారాలు, ఏడు ద్వారాలతో మందిరం నిర్మించింది ఈ తొండమానే.

తరువాతి కాలంలో శత్రువులు ఈయన రాజ్యంపై దండెత్తి వస్తే శ్రీనివాసుని ప్రార్ధించి శరణుకోరితే, భగవంతుడు అనుగ్రహించి తన ఆయుధాలు, శంఖు చక్రాలను అతడికి సహాయంగా పంపుతాడు.

ఆ శంఖచక్రాల సహాయంతో శత్రువులను జయించి శ్రీనివాసునికి కృతజ్ఞతలు చెప్పడానికి వేంకటాచలానికి వస్తాడు. “నీ అనుగ్రహం నాపై కలిగిందని అందరికీ తెలియడానికి నీ శంఖచక్రాలు నాతో ఉండనీ స్వామీ. నిన్ను శంఖచక్రాలు ధరించకుండా చూసిన జనులు నన్ను నువ్వు అనుగ్రహించావని తెలిసేలా వరం ఇవ్వమని” ఒక వింత కోరిక కోరతాడు. భక్తవత్సలుడైన వేంకటేశుడు దానికి సరే అంటాడు. 

అందుకే శ్రీనివాసునికి తిరుమలలో శంఖచక్రాలు లేవు.

తిరుమల లీలామృతం !

!! ఓం నమో వేంకటేశాయ !!

!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!