వక్రోక్తి వైభవం!

వక్రోక్తి వైభవం!

.

ఇంతకీ వక్రోక్తిలో ఉన్నసంగతి ఏమిటి ? 

శ్లేషచేత , కాకువు చేత చెప్పగలచుకున్నదానిని కొంచెం వింతగాచెప్పటం. 

చెప్పిన పదాలే అక్కడ మరోకొత్త పదంచేరదు, 

వాటితోనే లోకోత్తరమైన చమత్కార అర్ధమును ప్రతిపాదించటం. 

-

వక్రోక్తిని చేమకూర వాడుకున్నంతగా యితరులు వాడు కోలేదు.

ఇప్పడో చిన్న పద్యాన్ని చూద్ధాం!

"ఆ:వె: నళిన లీల సంచు నలినలి గావించు , 

నించు మించులాడు నించుమించు; 

బాపు! భామ లేత నవ్వు లేమనవచ్చు? 

జగ మెఱుంగు దాని జగమెఱుంగు!!:

.

సుభద్ర సోయగం వర్ణించటం ప్రధానాంశం.

ఆమెనవ్వుమోము వికచారవిందపు 

అందాన్ని మించింది. మెరపు నొరపును మించింది,

ఆమెలావణ్యం లోకాతీతమైనది ,

అని చ్ప్పదలుచుకున్నాడు.కానీ యేమంటున్నాడు? 

పద్మాల యందాన్ని నలిపిపారేస్తుందట!

మెఱుపుల థళథళ నువెక్కిరిస్తుందట!

యింకేమనను?అని ఆశ్చర్యంప్రకటిస్తూ, దానిలావణ్యం 

చూచినవారి కెరుక,చూజనివారికేమెరుక? 

.

అంటూ సుభద్ర సోయగాన్ని చూడనివాడు పనికిమాలినవడని వ్యంగ్యంగా సూచిస్తున్నాడు. ఇదిగో యీగడసరితనం వక్రోక్తి వల్ల సంపాదించాడు.

-

దీన్నే శ్రీనాధ మహాకవి" హర చూడా హరిణాంక 

వక్రతగా సూచిచాడు.

ఉదాహరణ -

ప్రశ్న- " ఎద్దీశ్వరునకు వాహనంబగు?(ఈశ్వరుని వాహనమేది) 

దానికి సమాధానము:- ఎద్దు ఈశ్వరునకు వాహనంబగు; 

.

ప్రశ్న -కంబలవంతం నబాధతే శీతలం?

(యేబలవంతుని చలిబాధించదు? )

కంబళీ కలవానిని చలిబాధించదు.; 

-


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!