వేదాంతికి మట్టిదిమ్మ,-నవయువకునికి అపరంజిబొమ్మ,-పిల్లవానికి అమ్మ!


-

వేదాంతికి మట్టిదిమ్మ,-నవయువకునికి అపరంజిబొమ్మ,-పిల్లవానికి అమ్మ!

-

ఒక అందమైన అమ్మాయిని చూస్తే, ఒక వేదాంతికి, ఒక నవయువకునికి, ఒక పిల్లవానికీ, అలాగే మీలాంటి ఒక కవికీ, ఎలాంటి అనుభూతులు కలుగుతాయో - 

శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు ఒక భువనవిజయ సభలో చెప్పిన పద్యమిది. -

"ఒకనికి మట్టిదిమ్మవు, మరొక్కనికీ వపరంజిబొమ్మ, విం

కొకనికి నమ్మవౌదు, మధురోహల ఊయలలూగునట్టి యీ

సుకవికి యేమియయ్యెదవు సుందరి! యీ కవితాకళామయా

త్మికజగతిన్ రసజ్ఝరుల దేల్చెడి ముద్దులగుమ్మవౌదువా!

.

వేదాంతికి మట్టిదిమ్మ, నవయువకునికి అపరంజిబొమ్మ, 

పిల్లవానికి అమ్మ. ఎవరి మానసిక స్థితికి తగ్గట్టువారు స్పందిస్తారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!