'జనముద్దు' !

'జనముద్దు' !

.

శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి శిష్య శ్రేణి లోని ఒక అమూల్యరత్నం వేటూరి వారు. తమ గురువు గారి గురించి చెబుతూ ఆయన

అన్నమాటలు, యథాతథంగా: -

"తిరుపతి వేంకటకవులు ప్రౌఢ పండిత ప్రభు సభలలోననే కాదు, బాలపామర జారచోరాదుల గోష్టులలో గూడ కవితాచమత్కారములను గల్పించి సత్కారములను బడయగలరు.

వెంకట శాస్త్రి గారికి లల్లాయి పదములు పాడ వేడుక; 

కొల్లాయి గుడ్డలు వాడ వేడుక. 

వారికి భాషాడంబరమును, వేషాడంబరమును గిట్టవు. 

కనుకనే వారి కవితాకన్య 'జనముద్దుగా' వెలసినది!

వారి చనవు 'అల్లారుబెల్లముగా' నందరికీ నాస్వాద్యమైనది. సమయస్ఫూర్తి, హాస్యయుక్తి ప్రయుక్తి, చమత్కారము వెంకట శాస్త్రి గారికి నాజానమగు నలవాటు."

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!