గృహమే కదా స్వర్గసీమ”

గృహమే కదా స్వర్గసీమ” 

-

"ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ప్రతి మగాడు మొహం ఉదాసినంగా ముభావంగా విచారంగా పెట్టుకుని వెళ్ళాలి లేదంటే ఇంట్లో గొడవలు అవుతాయి”అన్నాడు ఏకాంబరం.

.


“ఛ అదేంటి అలా అంటావు.చక్కగా హాయిగా నవ్వుతూ ఉండాలి,గృహమే కదా స్వర్గసీమ” అన్నాడు పీతాంబరం.

.

“కాదు నేను చెప్పిందే కరక్టు.కావాలంటే జరిగింది చెప్తా విను” 

.

“ఏడుపు మొహంతో ఇంటికెడితే భార్య ఎదురొచ్చి ఏమండి అలా ఉన్నారు అంటుంది.ఆఫీసులో ప్రాబ్లం అని చెప్పగానే అబ్బ ఎంత కష్టపడుతున్నాడు అని ఆనందిస్తుంది.

అదే నవ్వుతూ వెళ్ళామనుకో.ఆ కధ ఇలా సాగుతుంది.

.

భార్య:ఏమండి ఏమిటి సంగతి ఇవాళ గొప్ప హుషారుగా ఉన్నారు.?

.

భర్త:ఏం లేదు.!

.

భార్య:ఏం నాతో చెప్పకూడదా! 

.

భర్త:ఏం లేదన్నాను కదా! 

.

భార్య:నాకుతెలుసులెండి, దార్లో ఎవరైనా టక్కులాడి లిఫ్ట్ అడిగి ఉంటుంది. 

.

భర్త:అదేంలేదే బాబు, ఆఫీసులో ఈ రోజు సరదాగా గడిచింది అందుకని. 

.

భార్య:ఏముంది మీ రిసెప్షనిస్టు మిమ్మల్ని చూసి పళ్ళికిలించి ఉంటుంది. 

.

భర్త:అదేం లేదు అంటే వినవేం! అయినా ఆవిడ అలాంటిది కాదు.

.

భార్య:ఆహా! అంతవరకూ వచ్చిందా ఆవిడ మీద ఈగ వాలనివ్వట్లేదు మీరు.

.

భర్త:ఆవిడ అలాంటిది కాదు అన్నానా-దానికి పెడర్ధాలు తీస్తావేం?

.

భార్య:అబ్బో!ఆవిడ మహా గొప్పది,నేనే పెడర్ధాలు తీసేదాన్ని!

.

భర్త:ఎక్కడినుంచి ఎక్కడికి లింకులు పెట్టేస్తావే?

.

భార్య:అవునుమరి నేను లింకులు పెట్టేదాన్ని అదిమాత్రం మహా సాధ్వి.

.

భర్త:ఛ!సరదాగా నవ్వినా తప్పే ఈ కొంపలో.

.

భార్య:అవును మరి మీకు మీ పిల్లలికి గొడ్డుచాకిరి చేస్తున్నాను కదా ఇది కొంపలాగే ఉంటుంది మీ కంటికి 

.

భర్త:అంటే నువ్వే కష్టపడుతున్నావా? నేను రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించడం లేదా!

.

భార్య:మహా కష్టపడి పోతున్నారు.కష్టపడే వాడికి పొద్దున్నే స్ప్రేలు సెంట్లు ఎందుకో!


భర్త:నేనో ఆఫిసరుని.నీట్ గా తయారవడం కూడా తప్పేనా!

.

భార్య:అవును మీరేమో పెద్ద ఆఫీసరు.నేను కూలిదాన్ని.ఇంకెందుకు ఈ కూలిదాని ఇంటికి రాకండి!


భర్త:దినేమ్మ జీవితం ఎప్పుడు ఏడుపులు పెడబొబ్బలు ఛ!

.

భార్య:ఈ ఏడుపుమొహం దానితో ఇంకెందుకు నేను మా పుట్టింటికి పోతాను మీరు హాయిగా కులకండి!


భర్త:పొతే పో ఏం బెదిరిస్తున్నావా? 

.

భార్య:నేనెందుకు పోతాను?మీ అంతు దాని అంతు చూడకుండా పోను

.

భర్త:(ఏడుపుమొహం పెట్టి)ఇంకఆపవే ఏమిటి ఈగోల పిల్లలు చూడు ఎలా భయపడుతున్నారో

.

భార్య:(భర్త మొహంలో ఏడుపుచూసిన ఆనందంలో)రండి భోజనం వడ్డిస్తా.

.

(ఫ్రెండ్స్ ఇక మీఇంటికి మీరెలా‌ వెళ్తారనేది మీ ఇష్టం)😅🤣

-


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!