అభిసారిక తెలుగు భాషలో ప్రచురించబడుతున్న శృంగార పక్షపత్రిక.


=

అభిసారిక!

.

అభిసారిక తెలుగు భాషలో ప్రచురించబడుతున్న శృంగార పక్షపత్రిక.

అభిసారిక తెలుగు కావ్యాలలో చెప్పబడిన అష్టవిధనాయికలలో 

ఒక శృంగార నాయిక. "అభిసారిక" లేదా "అభిసారిణి" అనగా ప్రియుడి కోసం సంకేత స్థలానికి పోయే నాయిక.

తెలుగు పత్రికలలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ సెక్స్ సైన్స్ విషయంగా ప్రారంభమై ఈనాటికీ ప్రజాభిమానంతో నడుస్తున్న పత్రిక అభిసారిక.

1949లో తెనాలి నుంచి ధనికొండ హనుమంతరావు దీనిని వెలువరించారు. వీరే స్వయంగా ఇంగ్లీషు పుస్తకాల నుంచి విషయ సేకరణ చేసి అనువదించేవారు. 

1960లో రాంషా (దర్భా వేంకట రామశాస్త్రి) మరియు శిరీష దంపతులు సామర్లకోట నుండి తమ సంపాదకత్వంలో దీనిని మరింత విజ్ఞాన పత్రికగా మలిచి తెలుగు ప్రజలకు చేరువయ్యేలా తీర్చిదిద్దారు. ఈ పత్రిక జూలై 27, 1961 తేదీన నమోదు (రిజిస్ట్రేషన్ నెం.5908) చేయబడినది. లైంగిక విజ్ఞాన విషయాలు ఆ రోజులలో బోధించడం తప్పుగానూ, విశృంఖలతగానూ భావించేవారు. కానీ మిగతా శాస్త్రాల వలెనే దీనినీ తెలుసుకుంటే యువత చెడు మార్గాలు పట్టదని, దంపతులైన జంటలు సంసార రథాన్ని సవ్యంగా నడుపుకుంటారనీ రాంషా శిరీష దంపతులు భావించి, అభిసారికను ముందుకు నడిపించారు. వీరి ఆదర్శంతో ఎంతో మంది వారి పిల్లలకు శిరీష అని పేరు పెట్టుకున్నారంటే అతిశయోక్తి కాదు.

అభిసారికలో లైంగిక విజ్ఞానంతో పాటు సమకాలీన రాజకీయాల విశ్లేషణలు, ధర్మశాస్త్రాల వివరణ, ఆంగ్ల తదితర భాషలలో వచ్చిన మంచి పుస్తకాల అనువాదాలు కూడా ప్రచురించేవారు.

ఉదాహరణకు మాక్సిం గోర్కీ మాల్వా, కన్నడంలో యూ.ఆర్.అనంతమూర్తి వ్రాసిన సంస్కార నవల సంస్కారం గా, చీకటే మిగిలింది, అహల్య కాపురం వంటి అనువాద నవలలను అభిసారిక ప్రచురించింది. ప్రస్తుతం దీనికి డా. పూషా సంపాదకులుగా, ప్రచురణకర్తగా వ్యవహరిస్తున్నారు .

---

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!