చెల్లియో చెల్లకో" ...శ్రీకృష్ణ రాయబారము !

_

చెల్లియో చెల్లకో" ...శ్రీకృష్ణ రాయబారము !

(పాండవోద్యోగ నాటకము - తిరుపతివేంకటకవులు)

-

శ్రీకృష్ణరాయబార ఘట్టములో, కృష్ణుని నోటినుండి వెలువడిన 

పద్యచతుష్టయం (4 పద్యములు) చాలా ప్రసిద్ధిని పొందినవి.

అవి "చెల్లియొ చెల్లకో - అలుగుటయే యెఱుంగని

-జెండాపైఁ గపిరాజు,=సంతోషంబున సంధి సేయుదురె" అనేవి..

తెలుగునాట ఈ పద్యాలను ఆరోజుల్లో పసులకాపరి నుండిపండితులవరకు అత్యుత్సాహముగా పాడుకుని పరవశించేవారు.

.

.

"చెల్లియొ చెల్లకో తమకుఁ జేసిన యెగ్గులు సైచి రందఱుం

దొల్లి, గతించె, నేడు నను దూతగఁ బంపిరి సంధి సేయ; నీ

పిల్లలు పాపలుం బ్రజలు పెంపువహింపగఁ బొందుఁ జేసెదో!

యెల్లి రణంబుఁ గూర్చెదవొ! యేర్పడఁ జెప్పుము కౌరవేశ్వరా!"

.

( Satyanarayana Piska గారి అద్బుత విశ్లేషణ -)

భావము: 

"సుయోధనా! తెలిసో, తెలియకో తమ పట్ల జరిగిన ఎగ్గులను (అపచారములను) పాండునందనులు భరించినారు. అదంతా గతం, జరిగిపోయిన సంగతి. ఇప్పుడు వారు సంధి చేసుకురమ్మని, నన్ను దూతగా పంపించినారు. సంధి చేసుకుంటే, గతమంతా సమసిపోతుంది. ధర్మజుడు యుద్ధం వల్ల కలిగే బంధునాశనమును నివారించమని కోరుతున్నాడు.

సంధి సమకూరితే మీ పిల్లలు, పాపలు, ప్రజలు అంతా శాంతిగా, 

సుఖంగా జీవించగలరు. మరి, నీ అభిప్రాయమేమిటొ స్పష్టంగా చెప్పు. 

సంధియా? సమరమా?" అని సూటిగా అడుగుతున్నాడు అచ్యుతుడు.

సమస్యను వివరించడం, సామంగా సదుపాయాన్నిసూచించడం,

సంధి లాభాలను సర్వజనసమ్మతంగా వివరించడం, పరిష్కారాన్ని సూటిగా ప్రశ్నించడం ఈ పద్యపాదాల్లో వరుసగా ప్రదర్శించిన వాక్యార్థ విన్యాసం!

.

ఇక, "చెల్లియో చెల్లకో" అనే పద్యపు ఎత్తుగడను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి

. ఈ పదబంధమును కాస్త నిశితంగా పరికిస్తే, చిత్రవిచిత్రమైన అర్థములనుస్ఫురింపజేస్తుంది.... చెల్లి కౌరవులు ఎగ్గులు చేశారు,

చెల్లక పాండవులు అనుభవించారు అని ఒక అర్థం.

కౌరవుల కార్యములు ధర్మదృష్టికి చెల్లునో, చెల్లవో అనేది విజ్ఞులు 

(భీష్మద్రోణాది కురువృద్ధులు) విచారించవలసిన విషయమనే హెచ్చరిక మరో అర్థం. "చెల్లుట" అంటే సమర్థులగుట అని అర్థముంది. 

ఈ ఎగ్గులన్నింటినీ పాండవులు సమర్థులై సైచినారో, అసమర్థులై సైచినారో గమనింపుడని ఇంకొక అర్థం..... 

మరి, వాసుదేవుని వాక్చాతుర్యమునకు మేర లేదుకదా!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!