పోతన గారి భాగవత పద్యం.! . 'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా ... కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ".! . (చదువుకోడానికి హాయిగా ఉండే పద్యం .) . సరస్వతీ మాత దర్శనం పోతనకింకా కాలేదు . ఆ దర్శనంకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృమూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నాడు . అందరూ అనుకునే మాట . సరస్వతీ మాత తెలుపు రంగులో ధగధ్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని . ఇక తన ఊహలకు పదను పెట్టాడు . శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల వంటి తెలుపా లేక శారద చంద్రబింబం లాగా ఉంటుందా కాదు కాదు పచ్చకర్పూరం లాంటి తెలుపేమో మాతది . ఊహకు అందలేదు . తెల్లని పటీరమూ (చందనం) , రాజహంసా , జాజిచెండ్లూ , నీహారాలూ (మంచు తుంపెరలు) , డిండీరం ( నురుగు ) , వెండికొండా , రెల్లుపూలూ , మల్లెలూ , మందారాలూ , పుండరీకాలూ ( తెల్ల తామర పూలు ) , ఆదిశేషుడూ , అన్నిటికీ మించి ఆకాశ గంగా ప్రవాహం — తెల్లగా , తేలికైన పసుపురంగుతో ఉండే వస్తువులన్నీ మదిలో భాసించాయి . ఏవీ మాతృమూర్తి తెలుపు రంగుకు ఉపమానాలుగా సరిపోలేదు . మాతృమూర్తిని ఆర్తితో అడిగ...
“ఎందు కొచ్చిన్ సిస్టర్స్” అంటూ శ్రీశ్రీ గారు విసిరిన చెణుకు బాగుంది. అయితే మీరు లలిత, పద్మిని, రాగిణి గార్ల ఫొటో పెట్టారు. కానీ ఆ ముగ్గురినీ “ట్రావెన్-కూర్ సిస్టర్స్” అనేవారని జ్ఞాపకం అప్పారావు గారూ 🤔.
ReplyDelete