Skip to main content
పోతనామాత్యుడు!
-
పోతనామాత్యుడు!
-
పోతనామాత్యుని ఊరు బమ్మెర గ్రామం,
వరంగల్ జిల్లా,లో వున్నది
ఇక్కడే పోతనామాత్యుడుమహాభాగవతాన్ని
ఆంధ్రీకరించారు
పోతన మహాకవి.శ్రీరామ సాక్షాత్కారం కూడా
ఇక్కడే జరిగింది.
.
అల వైకుంఠ పురమ్ములో'.......
అంటూ పోతన మనస్సుచెలరేగినది
ఇక్కడే. అసంపూర్తిగా ఉన్నపద్యపాదాన్ని
శ్రీరాముడే స్వయముగా పూరించిన ప్రాంతం ఇదే.
.
-
""అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహి పాహి" యనఁ గుయ్యాలించి సంరంభి యై!!.
.
కష్టాలలో చిక్కుకున్న వారిని రక్షించే విష్ణుమూర్తి ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ వారి అంతఃపురం ఉంది.
దాని పక్కనే ఉన్న మేడ సమీపంలోని అమృతపు జలాల సరస్సు దగ్గర చంద్రకాంత శిలపై పరచిన కలువ పూల పాన్పుమీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. ఒళ్ళు తెలియని భయంతో కాపాడు కాపాడు అని మొరపెట్టుకోటం ఆలకించాడు. కాపాడాలని వేగిరపాటు పడసాగాడు.
Comments
Post a Comment