llఎప్పటికీ నిండు జవ్వని ఎంకి ll

.

llఎప్పటికీ నిండు జవ్వని ఎంకి ll

-

ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి

మెళ్ళో పూసల పేరు

తల్లో పూవుల సేరు

కళ్ళెత్తితే సాలు:

రాసోరింటికైనా

రంగు తెచ్చే పిల్ల.

పదమూ పాడిందంటె

కతలు సెప్పిందంటె

కలకాలముండాలి.

అంసల్లె, బొమ్మల్లె

అందాల బరిణల్లె

సుక్కల్లె నా యెంకి

అంటూ ఎంకిని సృష్టించారు నండూరి వారు.

Comments