నరకాసురవధ-సత్యభామ యుద్ధంబు!!

                    నరకాసురవధ-సత్యభామ యుద్ధంబు!!

.

-శా

వేణిం జొల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ

శ్రేణిం దాల్చి ముఖేందుమండల మరీచీజాలముల్‌ పర్వఁగాఁ

బాణిం బయ్యెదఁ జక్కగాఁ దుఱిమి శుంభద్వీరసంరంభయై

యేణీలోచన లేచి నిల్చెఁ దన ప్రాణేశాగ్ర భాగంబునన్.

భావము:

ఆ లేడికన్నుల సుందరి సత్యభామ, వడివడిగా వాలుజడ ముడివేసుకుంది; చీరముడి బిగించింది; భూషణాలను సరిచేసుకుంది; పైట సవరించుకుంది; ముఖచంద్రుడు కాంతులీనుతుండగా తన కాంతుడు శ్రీకృష్ణుడి ముందు నిబ్బరంగా నిలబడింది.

అందాల రాశి శ్రీకృష్ణ భగవానుని ఇష్ట సఖి సత్య సమరసన్నాహానికి, వేసిన సాహితీ అలంకారాలు ఆ “ణ”కార ప్రాస; వేణిం, శ్రేణిం, పాణిం, ఏణీలోచన పదాల సొగసు; పద్యం నడకలోని సౌందర్యం బహు చక్కగా అమర్చిన పోతన్నకు జోహార్లు.

-

నరకాసురుడు ఆదివరాహ మూర్తికి భూదేవికి కలిపి జన్మించిన వాడు. వాడు పధ్నాలుగు భువనములను గెలిచినవాడు. సత్యభామ తానే స్వయంగా యుద్ధం చేస్తా నని కృష్ణుడితో చెప్పి గభాలున లేచి ముందుకు వచ్చింది.

తన పెద్ద జడను కదలకుండా గట్టిగా ముడివేసింది. తను వేసుకున్న హారములు అవీ బయటకు వ్రేలాడకుండా అమరిక చేసేసుకుంది. ఆమెలో ఎక్కడ భయం కనపడడం లేదు. ముఖం దేదీప్యమానం అయిపోతూ ఉండగా పమిట వ్రేలాడకుండా బొడ్డులో దోపుకుంది. కృష్ణుని ముందుకు వచ్చి “నాథా, ధనుస్సును ఇలా యివ్వండి” అని అడిగింది. కృష్ణుడు తెల్లబోయాడు.

ఆయన ఏమీ తెలియని వాడిలా ఒక నవ్వు నవ్వాడు. ఆయనకు తెలియనివి ఏమి ఉంటాయి. 

ఆ ధనుస్సును పట్టుకోగానే ఆవిడలో ఒక గొప్ప తేజస్సు కనపడింది. వెంటనే యుద్దమును ప్రారంభించి ఒక్కొక్క బాణము తీసి అభిమంత్రించి విడిచి పెడుతోంది. ఆవిడ ఒక్కొక్క బాణమును తీసి తొడుగుతుంటే వీర రసము, శృంగార రసము, భయ రసము, రౌద్ర రసములు ఆమెలో తాండవిస్తున్నాయి. రానురాను యుద్ధం పెరిగిపోతోంది. స్త్రీ అని ఉపేక్షిస్తే వీలు లేదని రాక్షసులలో వీరు లందరూ ముందుకు వచ్చి ఆమెపై బాణములను ప్రయోగించడం ప్రారంభించారు. ,మూడు లోకములలో ఉన్నవాళ్ళు తెల్లబోయే రీతిలో అందరూ ఆశ్చర్యపోయి చూసేటట్లుగా సత్యభామ యుద్ధం చేస్తోంది. 

భయంకరమయిన యుద్ధం చేసి చెమట పట్టేషి ముంగురులన్నీ నుదుటికి అంటుకుపోయిన సత్యభామ వంక చూసి కృష్ణుడు

“సత్యా, నీ యుద్ధమునకు నేను ఎంతో పొంగిపోయాను. అని ఆ ధనుస్సు పట్టుకున్నాడు. అప్పటికే అందరూ నిహతులయి పోయారు. నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణములతో నిలబడి ఉన్నాడు.

అపుడు నరకాసురుడు అన్నాడు “చేతకాని వాడివై భార్య యుద్ధం చేస్తుంటే నీవు పక్కన కూర్చున్నావు. పౌరుషం ఉన్నవాడివైతే యిప్పుడు యుద్ధమునకు రావలసింది” అన్నాడు. ఈమాటలు విని “నిన్ను నిర్జించడానికే కదా నేను వచ్చాను” అని తన చేతిలో వున్న సుదర్శన చక్రమును ప్రయోగించారు. ప్రయోగించగానే సుదర్శన చక్రధారల చేత త్రుంపబడిన నరకాసురుని శిరస్సు కుండలములు ప్రకాశిస్తూ ఉండగా దుళ్ళి నేలమీద పడింది. నరకాసురుని వధ జరిగిన వెంటనే నరకాసురుడు మరణించాడనే పరమ సంతోషంతో దేవతలు అందరూ వారి వారి లోకముల యందు దీపములను వెలిగించారు

. వాడు అమావాస్య నాడు చచ్చిపోయాడు. అందుకనే మనం దీపావళి అమావాస్య 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!