తెల్లవారవచ్చె తెలియక నా సామిll

తెల్లవారవచ్చె తెలియక నా సామిll 

-

తెల్లవారవచ్చె తెలియక నా సామి

తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా

మళ్ళీ పరుండేవు లేరా

మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు ….

మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు

మారాము చాలింకలేరా … మారాము చాలింకలేరా

తెల్లవారవచ్చె తెలియక నా సామి

తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా

మళ్ళీ పరుండేవు లేరా l 

-

కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా

కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా

తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా

తరుణులందరు నది చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా

దైవరాయ నిదురలేరాl 

-

నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా

నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా

నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా

నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా

వెన్న తిందువుగాని రారాl

తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా

మళ్ళీ పరుండేవు లేరా

మళ్ళీ పరుండేవు లేరాll 

(వడ్డాది వారిచిత్రం .మల్లాది వారి సాహిత్యం . నాకు ఇష్టమైన పాట .)

-

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!