Skip to main content
శివ ధ్యాన శ్లోకాలు.!
శివ ధ్యాన శ్లోకాలు.!
.
"ఆకర్ణకృష్టే ధనుషి జ్వలన్తీం దేవీమిషుం భాస్వతి సందధానమ్
ధ్యాయేన్మహేశం మహనీయవేషం దేవ్యాయుతం యోధతనుం యువానమ్ "
.
ప్రకాశించుచున్నదియు చెవివరకు లాగబడినదియు నగు
ధనస్సు నందు మహాప్రభావము గల జ్వలించుచున్న బాణమును సంధించుచున్నవాడును, యౌవనముగలవాడును, వీరుని రూపపము గల వాడును,
ఉత్తమమయిన అలంకారముగల దేవితో కూడిన వాడును,
అగు మహేశ్వరుని ధ్యానించుచున్నాను.
దేవత: రుద్రుడు
.
ఋషి: కశ్యపుడు
Comments
Post a Comment