కార్తీక పురాణం 27వ రోజు!!

-

కార్తీక పురాణం 27వ రోజు!!

-

దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట: 

మరల అత్రిమహాముని అగస్త్యునకిట్లు వచించెను- కుంభసంభవా! ఆ శ్రీహరి దుర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను. "ఓ దుర్వాస మహాముని ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆపది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెనుగాన, అందులకు నేనంగికరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతా క్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశ మొనర్పనెంచినాడు. ఆ కారణమూ వలన విష్ణు చక్రము నిన్ను భాదింపబూనెను. ప్రజారాక్షనమే రాజు ధర్మముగాని, ప్రజా పీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించాకూడదు. బ్రాహ్మణా యువకుని దండించుట కంటే పాతకములేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును. బ్రాహ్మణ హితకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాళ్ళతో తన్నినవాడును, విపర ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును, విపర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మ హ౦తుకులే అగుదురు. కాన, ఓ దుర్వాస మహర్షి! అంబరీషుడుని గురించి - తపశ్శాలియు, విప్రోత్త ముడును అగు దుర్వాసుడు నామూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో ! నేను బ్రాహ్మణ హంతకుడ నాయితినే- యని పరితాపము పొందుచున్నాడు కా బట్టి, నీవు వేగమే అబరిషుని కడకేగుము అందువలన నీవుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దుర్వసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!