సంగీత సాధన....సన్మార్గం!

సంగీత సాధన....సన్మార్గం!

.

సుబ్బయ్యగారింటి మీదుగా వెళ్ళుతుంటే, సంగీత సాధన గురించి తెలుసుకోవాలని. సుబ్బయ్యగారి తలుపు తట్టెను. నన్ను చూసి ఆశ్చర్యపోయారనిపించింది.

భయం భయంగా లోపలికి చూసి, “ధైర్యం చేసి లోపలికి రండి, కూర్చోండి” అన్నాడు.

లోపలి నుంచి సంగీత సాధన వినిపిస్తోంది.

.

ఎందా ఆ ఆ ఆ ఆ రో మ ఘా ఆ ఆ ఆ ఆ నుబా ఆ ఆ ఆవులు ఎందాఆ ఆ రో ఎందా రో ఓ ఓ ఓ ఓ ఓ ఎందా రో మా ఆ ఘా ఆ ఆ నుబావులు

.

“ఎందరో మహానుభావులు త్యాగరాజు కీర్తన అల్లా కాదనుకుంటానండి పాడడం,” అని నేను అన్నాను. 

.

ఆయన నిట్టూర్చి, “ఆవిడకు చెప్పేంత జ్ఙానం, ధైర్యం నాకు లేవండి. మీరేమైనా ధైర్యం చేస్తానంటే పిలుస్తాను ఆవిడను” అన్నాడు. “అబ్బే వద్దులెండి మీకు లేని ధైర్యం నేనెక్కడ తెచ్చుకోగలను” అని అన్నాను. కానీ ఇంతలో ఆవిడ నన్ను చూసింది.

అన్నయ్యా ఆ ఆ ఆ ఆ ఆ గారూ ఊ ఊ ఊ ఊ మీకు స్వా ఆ ఆ ఆ ఆ గతం అని ఎందరో..లాగా పాడింది. నిజం చెప్పొద్దూ నాకు కొంత భయం వేసింది

.

. సుబ్బయ్యగారు సమయస్ఫూర్తి ప్రదర్శించి, “అన్నయ్యగారికి అర్జెంట్ పని ఉందట. వెంటనే కాఫీ పట్టుకురా” అన్నాడు. 

.

ఆవిడ లోపలికి వెళ్లబోతూ వెనక్కి వచ్చింది. “అన్నయ్యగారూ, మఘాను బావులు కరెక్టా, మఘోను భోవులు కరెక్టా, మహాను భావులు కరెక్టా?” అని అడిగింది

.

. “మహానుభావులు కరెక్టు అనుకుంటానమ్మా, అందులో ఆవులు, బావులు, భోనాలు, ఘోరాలు లేవనుకుంటాను,” అన్నాను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!