బాదరాయణ సంబంధం ! (శబ్దరత్నాకరం.)


_

బాదరాయణ సంబంధం !

(శబ్దరత్నాకరం.)

.

బంధుత్వాలు ప్రస్తావన వచ్చినప్పుడు

"ఆ ఏదో బాదరాయణ సంబంధం" అనేస్తారు 

అంటే అవతలివాళ్ళతో పెద్దగా సాన్నిహిత్యం లేకపోయినా 

ఏదో దూరపు చుట్టరికం అడ్డంపెట్టుకొని పరివారం లోచేరిపోవడానికి ప్రయత్నిస్తుంటారు.

ఇలాంటి సంబంధాలవెనక ఒక కథ వున్నది.

ఒక పండితుడు ఏదో పనిమీదదూరప్రాంతానికి 

ఎడ్లబండి మీద వెళ్లివస్తున్నాడు. మధ్యాహ్నానికి ఒక వూరు చేరాడు. కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. తన వూరు

చేరాలంటే సాయంత్రమవుతుంది. తినడానికి అతని దగ్గర ఏమీలేదు.

ఊరుకాని వూరు ఎవరూ తెలిసినవాళ్లుకూడా లేరు. ఎలా అని ఆలోచించాడు.దగ్గరలోనిఒక యింట్లో ఏదో శుభకార్యము జరుగినట్టుంది.యింటివాళ్ళు ఆహ్వానితులను భోజనాలకు లేవండి అంటున్నారు.

వెంటనేబండిని అటు పోనిచ్చి ఆ యింటి ఎదురుగావున్న

రేగు (బదరీ) చెట్టు క్రింద బండిని నిలిపాడు. యెద్దును నీడలో

కట్టేసి దానికింత మేత వేశాడు.

తానూ వెళ్లి బంతిలో కూర్చున్నాడు.సుష్టుగా భోజనం చేశాడు. ఇంతలో ఆ యింటివాళ్లకేదో అనుమానంవచ్చింది

.అయ్యా! తమరెవరో తెలుసుకోవచ్చా? మీకు మా కుటుంబానికీ ఏమి సంబంధం?అని అడిగారు. దానికి ఆ

పండితుడు మీ యింటి ముంగిట బదరీ (రేగు)చెట్టు 

వుంది.నా బండి చక్రాలు బదరీ చెట్టు కలప తోనే తయారయ్యాయి. అదీ మీకూ, నాకూ గల బాదరాయణ సంబంధం

"అస్మాకం బదరీ చక్రం. యుష్మాకం బదరీ తరు:

" అంటూ ఈ "బాదరాయణ సంబంధ న్యాయం'' అని వ్యుత్పత్తి చెబుతుంది -. అనేసి ఆ పండితుడు త్రేన్చుకుంటూ వెళ్ళిపోయాడు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!