సంస్కృతారణ్య సంచారీ విద్వన్ మత్తేభ శృంఖలం "

-

సంస్కృతారణ్య సంచారీ విద్వన్ మత్తేభ శృంఖలం " 

-

ఒకరోజు రాయల ఆస్థానానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు. 

రాయలు అతనిని గౌరవించి ఉచితాసనం యిచ్చాడు.

అతని ప్రతిభను గౌర వించి తగు రీతి సన్మానించాడు. 

అతను తెలుగు కావ్యాలను యెగతాళి చేస్తూ 

"ఆంద్ర భాషా కావ్యమయోమయ విభూషణం" 

అర్థము:-- ఆంధ్ర భాష కావ్యాలన్నీ యినుప ఆభరాణాల వంటివి.

అంటే పనికి రానివి అని.అన్నాడు. 

పెద్దన గారికి ఒళ్ళు మండి పోయింది. ఆయన వెంటనే లేచి 

.

"సంస్కృతారణ్య సంచారీ విద్వన్ మత్తేభ శృంఖలం " 

అని పూరించాడు. 

అర్థము:-- మా తెలుగు కావ్యాలు సంస్కృత మనే అడవిలో మదించిన

ఏనుగుల లాగా సంచరించే సంస్కృత పండితులకు సంకెళ్ళవంటివి. 

సంకెళ్ళు యినుము తోనే చేస్తారు కదా! 

(దీన్నే కుక్క కాటుకు చెప్పు దెబ్బఅంటారు) సంస్కృత పండితుడు 

తలవంచుకొని సభ నుండి వెళ్ళిపోయాడట. .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!