సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) - శ్లోకము (20)

-

సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
-

శ్లోకము (20)కిరన్తీమఙ్గేభ్యః కిరణ నికురుమ్బా మృతరసం
హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తిమివయః,
స సర్పాణాం దర్పం శమయతి శకున్తాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా !!
.
తల్లీ ! సర్వావయవాల నుంచి ప్రసరించే కిరణ
సమూహం నుంచి జనించిన అమృత రసాన్ని
వర్షిస్తూన్న నిన్ను ఏ సాధకుడు చంద్ర కాంతమణి
నిర్మిత దేహం గల ప్రతిమ మాదిరి హృదయం లో
ప్రతిష్ఠించి ధ్యానిస్తూన్నాడో అతడు గరుత్మంతుడి
లా సర్పాల దర్పాన్ని శమింప జేస్తున్నాడు. జ్వర
తీవ్ర త చేత ఎంతో తాపంచెందే రోగులను అమృత
నాడియైన తన చల్లని చూపుచేత జ్వర బాధను
తొలగించి సుఖాన్ని హాయిని కలిగిస్తున్నాడు.
.
ఓం మహామాయాయైనమః
ఓం మంత్రారాధ్యాయైనమః
ఓం మహాబలాయైనమః
.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!